నవతెలంగాణ – మణుగూరు
సింగరేణి కార్మికుల కొరకు ఏఐటియుసి నిరంతరం సమరశీల పోరాటాలు నిర్వహిస్తున్నదని సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి వై రాంగోపాల్ అన్నారు. మంగళవారం మణుగూరు ఓసి లో ఫిట్ మీటింగ్ పాల్గొని మాట్లాడుతూ సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘంగా గెలిచినప్పటి నుండి అనేక సమస్యలపై యాజమాన్యంతో స్ట్రక్చర్ సమావేశాలలో చర్చించడం జరిగిందని అన్నారు. సింగరేణి సంస్థ అభివృద్ధికి ఏఐటియుసి కట్టుబడి ఉందని మణుగూరు ఏరియాలో ఓసి టు డిప్ సైట్ బ్లాక్ సింగరేణికే కేటాయించాలని డిమాండ్ చేశారు. దీని ద్వారా మణుగూరు ఏరియా భవిష్యత్తు మరో 20 సంవత్సరాలు డోకా ఉండదని అన్నారు. ప్రభుత్వ రంగ సంస్థ చేతుల్లోనే బొగ్గు పరిశ్రమ ఉండాలని ఏఐటియుసి పోరాటం చేస్తుందని అన్నారు.
కొన్ని కార్మిక సంఘాలు పోరాటాలు చేతగాక ఏఐటీయూసీ యూనియన్ ని విమర్శిస్తున్నాయని అన్నారు సింగరేణి సంస్థ రక్షణ, కార్మికుల హక్కుల పరిరక్షణ కొరకు ఏఐటీయూసీ రాజీలేని పోరాటం చేస్తుందని అన్నారు. సందర్భంగా పిట్ సెక్రటరీ శ్రీ సాయి ప్రకాష్ చారి ఆధ్వర్యంలో బ్రాంచ్ కార్యదర్శి వై రాంగోపాల్ గారు పోలిపాక అభిలాష్, పాటి ప్రసాద్, సలీం ల కు కండువాలు కప్పి యూనియన్ లోకి స్వాగతం పలకడం జరిగింది. సమావేశం అనంతరం కార్మికులను, కాంట్రాక్ట్ కార్మికులను, సర్వే డిపార్ట్మెంట్ను కలుసుకొని వారి సమస్యలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. కార్మికుల సమస్యలను పరిష్కరించాల్సిందిగా కాలరీ మేనేజర్ ని కోరడం జరిగింది.
ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచ్ కార్యదర్శి మేకల ఈశ్వరరావు. ఆఫీస్ బేరర్ ఆవుల నాగరాజు. ఆదర్ల సురేందర్ సెంట్రల్ కమిటీ మెంబర్ కామ్రేడ్ దాట్ల సందీప్ కుమార్ పిట్ కార్యదర్శి సాయి ప్రకాష్ చారి. సుధాకర్,రవి కోటేశ్వరరావు, బిఎన్ఆర్ రెడ్డి, శంకర్, రంజాన్, సాంబశివరావు , కార్మికులు మరియు కాంట్రాక్టు కార్మికులు తదితరు కార్మికులు మరియు కాంట్రాక్టు కార్మికులు పాల్గొన్నారు.



