నవతెలంగాణ-హైదరాబాద్ : జాతీయ గిరిజన కానోయింగ్ స్ప్రింట్ చాంపియన్‌షిప్ పోటీలు మంగళవారం హుస్సేన్‌సాగర్‌లో అట్టహాసంగా ఆరంభమయ్యాయి. పది రాష్ట్రాల గిరిజన క్రీడాకారులు క్రీడాకారులు ఈ పోటీల్లో పోటీపడుతున్నారు. బోట్స్‌క్లబ్‌లో జరిగిన ఆరంభ వేడుకలకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ‘గిరిజన యువత సాధికారత, సంప్రదాయ క్రీడా వారసత్వ పరిరక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది.
బిర్సా ముండా స్ఫూర్తితో గిరిజన సమాజం ఐక్యత, ధైర్యం, సాంస్కృతిక ఔన్నత్యం ఈ క్రీడా ఉత్సవంలో ప్రతిబింబిస్తున్నాయని’ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ అన్నారు. గ్రామీణ గిరిజన క్రీడా ప్రతిభను వెలికితీసి.. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో అవకాశాలు లభించేలా ప్రోత్సాహం అందిస్తామని తెలిపారు. మూడు రోజుల పాటు సాగే కానోయింగ్ స్ప్రింట్ పోటీలు గురువారం ముగుస్తాయి. ఆరంభ వేడుకల్లో గిరిజన సంప్రదాయ కళా రూపాల ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి.
గిరిజన కానోయింగ్ పోటీలు ఆరంభం
- Advertisement -
- Advertisement -



