- Advertisement -
అమరావతి : బంగాళాఖాతంలో ఏర్పడిన మొంథా తుపాను తీరాన్ని తాకింది. కాకినాడ-మచిలీపట్నం మధ్య అంతర్వేదిపాలెం సమీపంలో తీరాన్ని తాకింది. పూర్తిగా తీరం దాటేందుకు మూడు నుంచి నాలుగు గంటల సమయం పడుతుందని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 100 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశం ఉంది. తీరం దాటే ప్రక్రియ ప్రారంభమైన నేపథ్యంలో తీర ప్రాంత జిల్లాల్లో భారీగా గాలులు వీస్తున్నాయి. తుపాను ప్రభావం తో కాకినాడ, కోనసీమ, ఏలూరు, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో కుండ పోత వర్షాలు కురుస్తున్నాయి. రానున్న 24 గంటల్లో తీరప్రాంతంలో 15 నుంచి 20 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
- Advertisement -



