అంకారా : టర్కీలో భూకంపం సంభవించింది. 6.1తీవ్రతతో భూమి కంపించినట్లు అధికారులు తెలిపారు. స్థానిక కాలమానం ప్రకారం సోమవారం రాత్రి ప్రకంపనలు చోటు చేసుకున్నా యని అన్నారు. పశ్చిమ టర్కీలోని బలికేసర్ ప్రావిన్స్‌లోని సిందిర్గి పట్టణంలో కేంద్రీకృత మైనట్టు విపత్తు , అత్యవసర నిర్వహణ సంస్థ (ఏఎఫ్‌ఏడీ) తెలిపింది. 5.99 కి.మీ లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు వెల్లడించింది. ఇస్తాంబుల్‌లో సమీపంలోని బుర్సా, మనీసా , ఇజ్మీర్ ప్రావిన్స్‌ల్లో భూకంపం సంభవించింది. సిండిర్గీలో సుమారు మూడు భవనాలు , రెండంతస్తుల దుకాణం కూలిపోయిందని అంతర్గత మంత్రి అలీ తెలిపారు. గతంలో సంభవించిన భూకంపంలోఈ నిర్మాణాలు దెబ్బతి న్నాయని అన్నారు. ప్రజలు భయాందోళ నలతో ఇండ్ల బయటే ఉన్నారని హబెర్‌టర్క్ టెలివిజన్ నివేదించింది. ఈ ఏడాది ఆగస్టులో సిండిర్గిలో 6.1తీవ్రతతో భూకంపం సంభవించిన సంగతి తెలిసిందే.
టర్కీలో 6.1తీవ్రతతో భూకంపం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



