- Advertisement -
డిఎస్పి బాలకృష్ణ రెడ్డి
నవతెలంగాణ తాండూరు
తుఫాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డిఎస్పి బాలకృష్ణ రెడ్డి అన్నారు. రాబోయే రోజుల్లో కూడా మరింతగా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో, జిల్లా ప్రజలు ఎంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పోలీస్ అధికారులు వెంటనే తమతమ పోలీస్ స్టేషన్ల పరిధిలోని వాగులు, కుంటలు, చెరువులలోని వరద నీటి ప్రవాహంపై నిరంతరం దృష్టి పెట్టాలని ఆదేశించారు. మరింత పటిష్టంగా బందోబస్త్ నిర్వహించాలని, ముందస్తు జాగ్రత్త చర్యలను పటిష్టం చేయాలని సూచించారు. రాకపోకలకు ఆటంకం కలిగించేలా పొంగిపొర్లుతున్న వాగులు, నాళాల దగ్గర రోడ్డులను బ్లాక్ చేయాలని ఆదేశించారు.
- Advertisement -



