నవతెలంగాణ కల్వకుర్తి టౌన్
కల్వకుర్తి నియోజకవర్గంలో కురుస్తున్న భారీ వర్షాలకు ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మాజీ మిషన్ భగీరథ వైస్ చైర్మన్, తలకొండపల్లి మాజీ జెడ్పిటిసి ఉప్పల వెంకటేష్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. రాష్ట్రంతో పాటు కల్వకుర్తి నియోజకవర్గం ప్రజలు ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ప్రజలు ఇళ్ల నుండి బయటకు రావొద్దు. విద్యుత్ స్తంభాలను, కరెంట్ తీగలను, ట్రాన్స్ ఫార్మర్లను తాకవద్దు. రోడ్డుపై వెళ్లేటప్పుడు మ్యాన్ హోల్స్, డ్రైనేజీని గమనించి వెళ్లాలి. ఉదృతంగా ప్రవహించే చెరువులు వాగుల వద్దకు వెళ్ళవద్దు. కూలిపోయే స్థితిలో ఉన్న పాత గోడలను తాకకుండా, పాత ఇళ్లల్లో ఉండకుండా జాగ్రత్తలు పాటించాలి. వర్షం కురుస్తున్నప్పుడు చెట్ల కింద నిలబడటం, కూర్చోవడం చేయవద్దు. వర్షంలో పిల్లలను ఆడుకునేందుకు పంపించొద్దు. ఆయన అన్నారు.
heavy rains: భారీ వర్షాలకు ప్రజలంతా అప్రమత్తగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



