Thursday, October 30, 2025
E-PAPER
Homeఆదిలాబాద్జాతీయ రహదారిపై చిరుతపులి సంచారం..

జాతీయ రహదారిపై చిరుతపులి సంచారం..

- Advertisement -

నవతెలంగాణ – ముధోల్
బాసర – భైంసా జాతీయ రహదారిపై ముధోల్ కంటి ఆస్పత్రి సమీపన మంగళవారం రాత్రి చిరుతపులి వాహనాదారులకు కనిపించింది. చిరుతపులి రోడ్డు దాటి ముధోల్ ,తరోడ శివారు వైపు వేళ్ళిందని పలువురు పేర్కొంటున్నారు. ఈవిషయం బుధవారం ఉదయం తేలుసుకున్న  ఫారెస్ట్ అధికారులు లక్ష్మణ్, కృష్ణ సంఘటనా స్థలాన్ని పరీశీలించారు. రోడ్డు పక్కన, వ్వవసాయ చేనులో చిరుత పాదం ముద్రలను గుర్తించారు. ఈ ప్రాంతంలో చిరుత పులి సంచరిస్తోందని వారు ధ్రువీకరించారు. వ్వవసాయ పొలాలకు వేళ్ళే రైతులు, పశువుల కాపరులు , కూలీలు జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రజలు గుంపులు, గుంపులుగా వెళ్లాలన్నారు. చేతిలో కర్ర ఉండాలన్నారు. చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -