– తహసిల్దార్ చందా నరేష్
నవతెలంగాణ-నెల్లికుదురు : మెంథా తుఫాను ప్రభావం కారణంగా గా మహబూబాబాద్ జిల్లా లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు కావున మండల ప్రజలు, అప్రమత్తంగా ఉండాలని నెల్లికుదురు తహసిల్దార్ చంద నరేష్ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజలు ప్రమాదాలు పొంచి ఉన్న స్థలానికి వెళ్లకూడదని తెలిపారు. రైతులు వేసిన వివిధ పంటలైన, మొక్క జొన్న , వరి, పంటల ను ఆరబెట్టిన రైతులు తమ పంటను టార్పాలి న్ తో కప్పుకుంటే తడవకుండా కాపాడుకోవచ్చు అని అన్నారు. వరద వచ్చే ప్రాంతాలలో ప్రజలు తగు జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. ప్రజల అవసరం ఉంటే తప్ప బయటకి రాకూడదని అన్నారు.లోతట్టు ప్రాంతాల్లో నివసించేవారు, అవసరమైతే ముందుగానే సురక్షిత ప్రాంతాలకు లేదా పునరావాస కేంద్రాలకు వెళ్లాలి. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు వెళ్లకూడదు.బలమైన గాలులు వీచేటప్పుడు, అత్యవసరమైతే తప్ప ఇంటి నుంచి బయటకు వెళ్లవద్దు అని సూచించారు. విద్యుత్ లైన్లు తెగిపడినట్లయితే, వాటికి దూరంగా ఉండాలి. విద్యుత్ అధికారులకు సమాచారం అందించాలి. ఇంట్లో ప్రధాన విద్యుత్ స్విచ్‌ను ఆఫ్ చేయండి. దెబ్బతిన్న రోడ్లు, వంతెనల మీద ప్రయాణించడం ప్రమాదకరం, కాబట్టి వాటికి దూరంగా ఉండాలి అని ప్రజలకు తెలిపారు. వీరి వెంట డిప్యూటీ తాసల్దార్ శ్రీనాథ్ ఎం ఆర్ ఐ రామకృష్ణ సిబ్బంది ఉన్నారు.
మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



