Thursday, October 30, 2025
E-PAPER
Homeజిల్లాలురైతు మెడపై కత్తిలా మోంథా తుపాన్.!

రైతు మెడపై కత్తిలా మోంథా తుపాన్.!

- Advertisement -

ఆందోళనలో అన్నదాత….అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక

నవతెలంగాణ-మల్హర్ రావు

నైరుతి ఋతుపవనాలు పుంజుకోవడం,దీనికి తోడుగా లోయర్ మానేరు డ్యామ్ నీరు విడుదల చేయడంతో మానేరు పరివాహక గ్రామాలైన తాడిచెర్ల, మల్లారం, వళ్లెంకుంట, కేశారంపల్లి, కుంభంపల్లి, పివినగర్ లో వరి, పత్తి పంటలు చేతికొచ్చే సమయాన నెలకొన్న వాతావరణం రైతులకు ఆందోళన కలిగిస్తోంది. ఈనెలలో కురిసిన వర్షాలతో చేన్లలోనే పత్తి తడవడంతో అటు వ్యాపారులు,ఇటు సీసీఐ కేంద్రాల్లో మద్దతు ధర దక్కడం లేదు. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న వరి కోతలపైనా తుపాను ప్రభావం పడుతోంది. వరి కోతలు ఆపితే పంట పాడవుతుందా.. కోస్తే ఎక్కడ ఆరబోయాలా అన్న సందిగ్ధంలో రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. మండలంలో 15,500 ఎకరాల్లో వరి,3,800 ఎకరాల్లో పత్తి సాగయ్యాయి.

కాపాడుకోవడం ఎలా?

తుపాను ప్రభావం నుంచి పంటలను రక్షించుకునేందుకు రైతులు తంటాలు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో ముందుగా సాగు చేసిన వరి కోతలు ప్రారంభమయ్యాయి. మరికొన్ని గ్రామాల్లో పొట్ట, కోత దశకు చేరుకున్నాయి. కోతకు సిద్ధంగా ఉన్న వరి పొలాలు మాత్రం తుపాను హెచ్చరికల నేపథ్యాన కోతలు వాయిదా వేస్తున్నారు.

తుపాన్ పంజా..

మోంథా తుపాను మండలంపై విరుచుకుపడుతుందనే సమాచారంతో రైతుల్లో ఆందోళన నెలకొంది.మంగళవారం,బుధవారంతోపాటు గురువారం ఉదయం వరకు జిల్లాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ బులెటిన్ విడుదల చేసింది. ఉరుములతో కూడిన వర్షంతోపాటు 40 – 40 కి.మీ. వేగంతో ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించగా అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయడమే కాక రిజర్వాయర్లలోకి ఇన్ఫ్రా ఎప్పటిక ప్పుడు తెలుసుకునేలా ఏర్పాటుచేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -