Thursday, October 30, 2025
E-PAPER
Homeతాజా వార్తలుతొలి టీ20.. వ‌ర్షంతో నిలిచిన మ్యాచ్‌

తొలి టీ20.. వ‌ర్షంతో నిలిచిన మ్యాచ్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్ : ఆస్ట్రేలియాతో జ‌రుగుతున్న తొలి టీ20 మ్యాచ్‌లో ఇండియ‌న్ ఓపెన‌ర్ అభిషేక్ శ‌ర్మ ఔట‌య్యాడు. 14 బంతుల్లో అత‌ను 19 ర‌న్స్ చేశాడు. దాంట్లో నాలుగు బౌండ‌రీలు ఉన్నాయి. టాస్ గెలిచిన ఆస్ట్రేలియా ముందుగా ఫీల్డింగ్ ఎంచుకున్న‌ది. అయితే భార‌త ఓపెన‌ర్లు గిల్, అభిషేక్ తొలి వికెట్‌కు 35 ర‌న్స్ జోడించారు. నాథ‌న్ ఎల్లిస్ బౌలింగ్‌లో అభిషేక్ క్యాచ్ ఇచ్చి ఔట‌య్యాడు. అయితే 5 ఓవ‌ర్ల‌లో వికెట్ న‌ష్టానికి భార‌త్ 43 ర‌న్స్ చేసింది. ఆ ద‌శ‌లో వ‌ర్షం రావ‌డంతో మ్యాచ్‌ను నిలిపివేశారు. గిల్ 16, సూర్య 8 ర‌న్స్‌తో క్రీజ్‌లో ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -