నవతెలంగాణ – క్రిష్ణ
నారాయణపేట జిల్లా కృష్ణ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యలయం అదికారులు సిబ్బంది సమయపాలన పాటించడం లేదు. బుధవారం 11.20 గంటల వరకు ఏ ఒక్క అధికారి రాకపోవడంతో ప్రజాపాలనలో భాగంగా వివిధ పనుల కొరకు వచ్చినా ప్రజలు తిరిగి వెళ్లిపోయారు. ఈ విషయంమై ఎంపీడీవోను నవతెలంగాణ వివరణ కోరగా నేను గత రెండు రోజుల క్రిందనే భాద్యతలు స్వీకరించి విధులకు చేరాను సమయపాలన పాటించని ఉద్యోగస్తులపై చర్యలు తీసుకుంటానని తెలిపారు.
కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్లుగా విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు మాత్రం ఎప్పుడొస్తారో ఎప్పుడు పోతారో ఎవ్వరికి తెలియదని, పనుల కొరకు వచ్చిన ప్రజలకు పనులు చేయక కాలయాపన చేస్తున్నారని మండల ప్రజలు వాపోతున్నారు. లోకమే కంప్యూటర్ యుగంలో ఉన్నప్పటికీ ప్రభుత్వ ప్రధానమైన కార్యాలయంలో ఇంకా అధికారుల, ఉద్యోగుల విషయంలో హాజరు పుస్తకాలతో కాలం వెళ్లడిస్తున్నారని మండల ప్రజల విమర్శిస్తున్నారు. ప్రైవేటు సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు సమయపాలనతో పాటు తమ విధులను సక్రమంగా నెరవేరుస్తారు.
కానీ ప్రజలకు సేవ చేయాల్సిన ప్రభుత్వ ఉద్యోగులు మాత్రం సమయపాలన పాటించకుండా పూర్తిగా నిర్లక్ష్యం వహిస్తున్నారు అంటే అతిశయోక్తి లేదు. ప్రభుత్వ కార్యాలయమే కదా తమ ఇష్టం వచ్చిన సమయానికి రావచ్చన్న ధీమాతో ఉద్యోగులు ఉండడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఉదయం 11.20 గంటల సమయం అవుతున్న మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఖాళీ కుర్చీలు దర్శనమిస్తున్నాయంటే ఈ శాఖ అధికారుల నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో కాలి కుర్చీలను చూస్తే అర్థమవుతుంది . ఇప్పటికైనా సమయపాలన పాటించని ఉద్యోగులను గుర్తించి జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కార్యాలయాలకు వచ్చిన ప్రజలు ఉన్నత అధికారులను కోరుకుంటున్నారు.


