Thursday, October 30, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

వరద ప్రభావిత ప్రాంతాలను పర్యవేక్షించిన ఎమ్మెల్యే వంశీకృష్ణ

- Advertisement -

నవతెలంగాణ – చారకొండ
మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా, అచ్చంపేట నియోజకవర్గ వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అచ్చంపేట నియోజకవర్గంలోని చారకొండ మండలం తుర్కల పల్లి గ్రామంలో ఎమ్మార్వో , ఎంపీడీవో, ఎంపీవో, పోలీసు శాఖ వారితో కలిసి పలు ప్రాంతాలను ఎంఎల్ఏ డాక్టర్ వంశీ కృష్ణ మండల పరిధిలోని వివిధ గ్రామాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రజలు మరియు అధికారులతో మాట్లాడుతూ.. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో కలిసి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తూ పరిస్థితిని సమీక్షించారు.

వివిధ వాగుల్లో వరద ఉధృతిని దృష్టిలో పెట్టుకుని, అధికారులను అప్రమత్తం చేసి, అవసరమైన జాగ్రత్తల కోసం తగిన ఆదేశాలు ఇస్తూ, ప్రజలు ఆందోళన చెందవద్దనీ, ప్రభుత్వం మీకు అన్ని విధాలా అండగా ఉంటుంది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి, రెవెన్యూ, ఇరిగేషన్, పోలీస్, విద్యుత్ సంబంధిత అధికారులు ఇప్పటికే సహాయక చర్యలు చేపడుతున్నారని తెలిపారు. ఇళ్ల నుంచి ఎవరు బయటికి రావద్దనీ, శిథిల వ్యవస్థలో ఉన్న ఇండ్లలో గాని మట్టి ఇండ్లలో గాని, విద్యుత్ స్తంభాల దగ్గర జాగ్రత్తగా ఉండాలని, రెవిన్యూ అధికారులు మరియు ఇరిగేషన్ అధికారులు పోలీసు అధికారులు ప్రభుత్వ అధికారులు అందరు కూడా అప్రమత్తంగా పరిస్థితులను పర్యవేక్షిస్తూ ఉండాలని, ప్రజలు ఎవరు కూడా చెరువులు వాగులు ప్రవహిస్తున్న ప్రదేశంలోకి వెళ్లకూడదని ఆయన సూచించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -