నవతెలంగాణ -నర్సంపేట
భారీ వర్షంతో జనం అతాలకుతం అవుతున్నారు. పంటలు నీటమునిగాయి.. వరద తాకిడికి రవాణా వ్యవస్థ స్తంభించింది.. మొంథా తుఫాన్ ప్రభావంతో బుధవారం కురుస్తున్న భారీ వర్షం రైతులను నట్టేట ముంచింది.. వరంగల్ జిల్లాలో మధ్యాహ్నం 12గం లకే 7 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మధ్యాహ్నం తర్వాత వర్షం అదికాస్తా మరింత తీవ్ర రూపం దాల్చింది. నర్సంపేట డివిజన్ లో కోత దశకు దగ్గరలో ఉన్న వరి పంట నేలమట్టమైంది.. మార్కెట్ లో అమ్మకానికి తీసుకొచ్చిన మొక్కజొన్న వరదకు కొట్టుకపోయింది..కళ్లాల్లో ఆరబోసిన దిగుబడులు తడిసి ముద్దయి రైతులకు తీరని నష్టం మిగిల్చింది..మరో వైపు వాగులు పొంగిపొర్లుతున్నాయి..లోలెవల్ కాజ్వేల వద్ద రాకపోకలు నిలిచిపోయాయి.. ఖానాపురం మండలం మనుబోతుల గడ్డ గ్రామంలో చిదరబోయిన రామచంద్రు అనే వ్యక్తి ఇల్లు కూలిపోయింది. రోజంతా కురుస్తున్న భారీ వర్షంతో రోడ్లన్నీ జలమయం అయ్యాయి.. జనం ఇండ్ల గడపదాటని పరిస్థితి నెలకొన్నది. కనీసం నిత్యావసర కూరగాయలు, పాలు కొనుగోలు చేయలేని స్థితిలో ఇండ్లల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది.
భారీ వర్షం.. నీట మునిగిన పంట
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



