నవతెలంగాణ – చారకొండ
మొంథా తుఫాన్ కారణంగా రాష్ట్రవ్యాప్తంగా.. మండల వ్యాప్తంగా గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు మండల కేంద్రంతో పాటు వివిధ గ్రామాల వాగులు, కుంటలు, చెరువులు నిండుకుండలా మారాయి. మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని వాగులోకి భారీగా వరద రావడంతో వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది.
గ్రామాల మధ్య రాకపోకలకు అంతరాయం
మండలంలోని ఎర్రవల్లి వాగు నిండుకుండలా మారి ఉదృతంగా ప్రవహిస్తు రోడ్డు మీది నుండి నీరు వేగంగా వస్తుండడంతో గోకారం చంద్రయన్ పల్లి, ఎర్రవల్లి గ్రామాల మధ్యన రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.
ఇళ్లలోకి చేరిన వరద నీరు
ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నిన్న రాత్రి కురిసిన భారీ వర్షానికి మండలంలోని చారగొండ ఈశ్వరమ్మ ఇంట్లోకి నీరు ప్రవేశించింది. ఇంట్లో ఉండటానికి ఇబ్బందికరంగా మారడంతో బాధితులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల స్పందించి తగు చర్యలు తీసుకొని నిత్యవసర సరుకులు అందించాలని వారు కోరారు.




