నవతెలంగాణ – డిండి : మొంథా తుఫాను ప్రభావం వల్ల గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల డిండి మండలంలోని వాగులు పొంగి పొందుతున్నాయి. ముఖ్యంగా డిండి ప్రాజెక్టు లోకి బుధవారం వరద ఉద్ధృతి పెరిగి ప్రాజెక్టు పొంగిపొర్లుతోంది. దీనికి తోడు నాగర్ కర్నూల్ జిల్లా తుమ్మేంపేట చెరువు తెగిపోవడం వల్ల ఆ నీరు కూడా డిండి ప్రాజెక్టులోకి వచ్చి చేరడంతో వరద వృద్ధి పెరిగింది. డిండి ప్రాజెక్టు సుమారు మూడు అడుగుల పైన నీరు పోస్తుందని ప్రజలు తెలియజేస్తున్నారు. ఈ వరద ఉదృతం వల్ల డిండి ప్రాజెక్టుకు కుడివైపున ఉన్న అలుగుల వద్ద శ్రీశైలం – హైదరాబాద్ హైవే పై నీరు బ్రిడ్జిపై నుంచి ప్రవహిస్తూ రోడ్డు తెగిపోయింది. వెంటనే పోలీసులు అప్రమత్తమై ప్రజల రాకపోకలను నిలిపిచేశారు. డిండి ఎస్సై సిహెచ్. బాలకృష్ణ ఇటీవల మాట్లాడుతూ ఇటీవల కురుస్తున్న వర్షాల వల్ల వాగులు పొంగిపొర్లుతున్నాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. విద్యుత్ స్తంభాల వద్దకు ఎవరు వెళ్లకూడదని, ప్రవహిస్తున్న నీటి వద్దకు వృద్ధులను పిల్లలను వెళ్ళనీయ్యవద్దని, రాత్రిపూట ప్రయాణం చేయవద్దని ఆయన కోరారు.
పొంగిపొర్లుతున్న డిండి ప్రాజెక్టు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



