Saturday, November 1, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపోలీసులకు మరోసారి చిరంజీవి ఫిర్యాదు

పోలీసులకు మరోసారి చిరంజీవి ఫిర్యాదు

- Advertisement -

సోషల్‌ మీడియాలో అభ్యంతరకర పోస్టులపై సైబర్‌ క్రైమ్‌కు..
నవతెలంగాణ-సిటీబ్యూరో

మెగాస్టార్‌ చిరంజీవి మరోసారి పోలీసులను ఆశ్రయించారు. సోషల్‌ మీడియా వేదిక ఎక్స్‌లో తనపై అభ్యంతరకర పోస్టులు పెడుతున్నారని దయా చౌదరి అనే వ్యక్తిపై బుధవారం సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇటీవల హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు చిరంజీవి దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు ఇచ్చినప్పటికీ, ఇంకా అదే తరహా పోస్టులు కొనసాగుతున్నాయని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. సంబంధిత వ్యక్తులపై తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. చిరంజీవి ఫిర్యాదు ఆధారంగా సైబర్‌ క్రైమ్‌ పోలీసులు కేసు విచారణ ప్రారంభించారు.

డీప్‌ ఫేక్‌లపై ఇప్పటికే చర్యలు
ఇటీవల కొందరు ఏఐ టెక్నాలజీ సాయంతో చిరంజీవి ఫొటోలను మార్ఫింగ్‌ చేసి, అశ్లీల వీడియోలు రూపొందించి పలు వెబ్‌సైట్లలో వైరల్‌ చేశారు. దీనిపై చిరంజీవి అప్పట్లోనే సైబర్‌ క్రైమ్‌ అధికారులకు ఫిర్యాదు చేశారు. అదే విషయమై సిటీ సివిల్‌ కోర్టును కూడా సంప్రదించారు. చిరంజీవి అనుమతి లేకుండా ఆయన పేరు, ఫొటోలు, వాయిస్‌ను ఎవరూ ఉపయోగించకూడదని కోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -