నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ (సీఐటీయూ అనుబంధం) రాష్ట్ర 4వ మహాసభలను ఈ ఏడాది నవంబర్ 9న సంగారెడ్డి పట్టణంలో నిర్వహించ నున్నారు. ఈ మహాసభలను జయప్రదం చేయడం కోసం ఆహ్వాన సంఘాన్ని ఏర్పాటు చేశారు. మహా సభలకు ఆహ్వాన సంఘం చైర్మెన్‌గా జె.మల్లిఖార్జున్ (సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు), ప్రధాన కార్యదర్శిగా ఎం. యాదగిరి, కోశాధికారిగా ఎస్. మహిపాల్‌లతో పాటు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్క రాములు ముఖ్య అతిథులుగా పాల్గొన నున్నారు. ఈ మహాసభలను జయప్రదం కోసం బుధవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో పోస్టర్‌ను ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర గౌరవాధ్యక్షులు భూపాల్, ఆహ్వాన సంఘం చీఫ్ ప్యాట్రన్స్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి బి.మల్లేష్, సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీకాంత్, ఆహ్వాన సంఘం ప్రధాన కార్యదర్శి ఎం.యాదగిరి, కోశాధికారి ఎస్.మహిపాల్, సీఐటీయూ రాష్ట్ర కమిటీ సభ్యులు వై.సోమన్న, సీఐటీయూ సంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు నాగేశ్వర రావు, ప్రవీణ్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి ఎన్.రమేష్ తదితరులు పాల్గొన్నారు. మహాసభలో వైద్యారోగ్య శాఖలోని అన్ని క్యాటగిరీల ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయడానికి తీర్మానాలు చేయ బోతున్నట్టు వారు వెల్లడించారు. మహా సభల జయప్రదం కోసం ఉద్యోగులందరూ ఆర్ధికంగా, హార్ధికంగా సహాయ, సహకారాలు అందించాలని కోరారు.
మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ మహాసభల పోస్టర్ ఆవిష్కరణ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



