నవతెలంగాణ జడ్చర్ల:
శాంతి భద్రతల పర్యవేక్షణలో అమరులైన పోలీసుల త్యాగాన్ని స్మరించుకుంటూ, జడ్చర్ల పోలీస్ స్టేషన్లో గురువారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మహబూబ్ నగర్ జిల్లా డీఎస్పీ వెంకటేశ్వర్లు ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… “పోలీసు శాఖలోని సిబ్బంది రక్తదానం ద్వారా సమాజ సేవలో ముందుంటుండటం గర్వకారణం” అని అన్నారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో జడ్చర్ల టౌన్ సీఐ కమలాకర్, ఎస్సైలు , రంగనాయక స్వామి దేవాలయం అధ్యక్షులు కాలువ రాంరెడ్డి, మహబూబ్ నగర్ క్లబ్ ఎం.సి మెంబర్ ధ్రువ పాల్గొన్నారు సేకరించిన రక్తం అత్యవసర పరిస్థితిలో ఉన్నవారికి ఉపయోగించి వారి ప్రాణాలను కాపాడడం కోసం రక్తం ఉపయోగపడుతుంది రక్తందానం చేసిన వారిని పరోక్షంగా ప్రాణాలను కాపాడే దేవుళ్ళు అంటారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ నిర్వాహకుడు లయన్ నటరాజ్, ఎస్ఐలు జయప్రసాద్, ఖాదర్, మల్లేష్ హెడ్ కానిస్టేబుల్ రమేష్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.



