- Advertisement -
నవతెలంగాణ వరంగల్: వరంగల్‌లో వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొండా సురేఖ పర్యటించారు. జలదిగ్బంధంలో చిక్కుకున్న బీఆర్‌నగర్‌లో సహాయక చర్యలను ఆమె పరిశీలించారు. వరద బాధితులతో ఫోన్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. మరోవైపు ముంపు ప్రాంతాల్లో ప్రజలకు అధికారులు.. డ్రోన్ల ద్వారా ఆహారం, మంచి నీరు, నిత్యావసర వస్తువులు పంపిస్తున్నారు. మంత్రి సురేఖతో పాటు ఎంపీ కడియం కావ్య, కలెక్టర్ సత్య శారద ముంపు ప్రాంతాల్లో పర్యటించారు.
- Advertisement -



