- Advertisement -
నవతెలంగాణ-షాద్ నగర్
ఎస్ ఎఫ్ ఐ రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కళాశాలల బంద్ విజయవంతం అయ్యింది.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎస్ ఎఫ్ ఐ జిల్లా ఎ ఉపాధ్యక్షులు శ్రీకాంత్ పాల్గొని మాట్లాడారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 8500 స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్ మెంట్ పెండింగ్ ఉన్నాయని,ఇప్పటికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టనట్లు వ్యవహరిస్తుందని అన్నారు. గత ప్రభుత్వం విద్యార్థులకు ఫీజు రియంబర్స్ మెంట్ ఇవ్వకుండా నాలుగు సంవత్సరాలు కాల వ్యాపాన చేసిందని, అదే తరహాలో కాంగ్రెస్ ప్రభుత్వం కూడా విద్యార్థులను పట్టించుకోకుండా వ్యవహరిస్తుందని వాపోయారు.
- Advertisement -



