డాక్టరు చదువుకు సాయపడండి..
నవతెలంగాణ – మక్తల్
కూలి పనులు చేస్తేనే కూడు దొరకని కుటుంబం తల్లిదండ్రులు నిరక్షరాస్యులు అయితేనేం ముత్యాల్లాంటి ముగ్గురు కూతుళ్లు చదువులో మేటిగా ఉన్నారు. నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం చిట్యాల గ్రామం. ఆదివాసి ఏకాలవ్య ఏరుకల బిడ్డ ఎస్ ఇంధు పదో తరగతి లో 9.5 మార్కులు సాధించింది ఇంటర్ లో 950 మరియు నీట్ లాంగ్ టర్మ్ కోచింగ్ వరకు ప్రభుత్వ గురుకుల కళాశాలలో చదువుకుంది.ఇందు తల్లి ఏస్ రాధిక, తండ్రి ఎస్ చెన్నప్ప రోజువారి కూలీలు.వీరికి ముగ్గురు అమ్మాయిలు.ఈ కుటుంబానికి ఎటువంటి వ్యవసాయ భూములు, ఆస్థులు లేవు, రెక్కా అడితేనే డొక్కాడని పరిస్థితి.
చిన్నా ఇంట్లో ఉంటు ముగ్గురూ అమ్మాయిలను గురుకులంలో చదివిస్తూ.పెద్ద అమ్మయ్ ఎస్ ఇందు నీట్ ఎంబీబీఎస్ సీటు సాధించడం జరిగింది.ఎస్ ఇందు కి ప్రతిమ ప్రైవేట్ మెడికల్ కళాశాల వరంగల్ లో ఎంబిబిఎస్ ప్రథమ సంవత్సరం సీటు వచ్చింది ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం ఫీజు 1,20,000 రూపాయలు చెల్లించాల్సిన అవసరం ఉన్నది మరియు హాస్టల్ ఫీజులు అధనం.పుస్తకాలు బట్టలు. కొనలేని పరిస్థితుల్లో ఇందు కుటుంబ పరిస్థితి ఫీజు చెల్లించలేకా ఆర్థిక స్థోమత లేక ప్రస్తుతము ఇంటి వద్ద కూలి పనులకు వెళ్తుంది. తల్లి తండ్రులు రోజు కూలి పనులు చేస్తూ ముగ్గురు అమ్మాయిల చదివిస్తూ ఇంట్ల పరిస్థితి బాగాలేక ఎంబిబిఎస్ ఫీజులు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ప్రస్తుతం పెద్ద అమ్మయ్ ఇందు పీజు చెల్లించే ఆర్థిక స్తోమత లేక ఆగిపోయే పరిస్థితి ఉన్నది.
అమ్మాయి తండ్రి ఎరుకల చెన్నప్ప..
గత ప్రభుత్వంలో ఎస్సీ ఎస్టీలకు మూడు ఎకరాల భూమి పంపిణీ చేస్తామన్నారు భూమీ ఇస్తారని ఆశించం కానీ రాలేదు. మా రెక్కల కష్టంతోనే మా పిల్లలను చదివిస్తూ ఉన్నంత స్థాయికి ఎదగాలని కోరుకున్నాము ఇందు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తు నిరుపేద. ఎకరం భూమిలేని ఎరుకలి కుటుంబంలో పుట్టి ప్రభుత్వ పాఠశాలలోనే చదివిస్తూ తమ పిల్లలు ఉన్నంత స్థాయికి ఎదగడంలో సంతోషిస్తూ నా తల్లిదండ్రులు మరోపక్క పేదరికం వెంటాడుతూనే ఉంది అని, ఎరుకలి చెన్నప్ప ఎరుకలి రాధిక ఇప్పటికైనా ఇప్పుడున్న ప్రభుత్వం స్పందించి తమ కూతురుని ఆదుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు.



