Friday, October 31, 2025
E-PAPER
Homeఖమ్మంబదిలీ అయిన ఏవో శివరాం ప్రసాద్

బదిలీ అయిన ఏవో శివరాం ప్రసాద్

- Advertisement -

నవతెలంగాణ – అశ్వారావుపేట
అశ్వారావుపేట మండల వ్యవసాయ శాఖ అధికారిగా పనిచేస్తున్న శివరాం ప్రసాద్ అంతర్రాష్ట్ర బదిలీల్లో బాగంగా ఆంధ్రప్రదేశ్ బదిలీ అయ్యారు.  ఈ క్రమంలో గురువారం స్థానిక రైతు వేదిక లో వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు పెంటేల రవికుమార్ అద్యక్షతన వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆత్మ – బీఎఫ్ఏసీ చైర్మన్ సుంకవల్లి వీరభద్రరావు మాట్లాడుతూ అంకిత భావంతో విధులు నిర్వహించే అధికారి ఎవరైనా ప్రజల్లో మన్ననలు పొందుతారని అన్నారు.

ఉద్యోగులకు బదిలీలు సాధారణమే అయినప్పటికీ పనిచేసిన చోటును విడిచి వెళ్ళడం ఎంతో ఆవేదనను కలిగిస్తుందని వ్యవసాయ శాఖ సహాయ సంచాలకులు రవికుమార్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ అనకాపల్లి కి చెందిన శివరాం ప్రసాద్ 2012 లో చర్ల మండలం సత్యనారాయణపురం ఏఈఓ గా ఉద్యోగం లో చేరారు.2017 లో చర్ల మండలం వ్యవసాయ శాఖ అధికారిగా పదోన్నతి పొందారు.2024 లో బదిలీల్లో బాగంగా అశ్వారావుపేట మండల వ్యవసాయ శాఖ అధికారి వచ్చారు.అంతర్రాష్ట్ర బదిలీల్లో నేడు ఆంధ్ర వెళ్ళారు.

ఈ కార్యక్రమంలో అశ్వారావుపేట ‘పాక్స్’ అద్యక్షులు చిన్నంశెట్టి సత్యనారాయణ, దమ్మపేట,ములకలపల్లి,అన్నపురెడ్డిపల్లి,చండ్రుగొండ మండలాల ఏవో లు చంద్రశేఖర్ రెడ్డి,అరుణ్ కుమార్,అనూష,వినయ్ లు,ఏఈఓ లు సతీష్,సూరిబాబు,రవీంద్ర,షకీరా భాను లు పాల్గొన్నారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -