జిల్లా కలెక్టర్ హనుమంతరావు..
నవతెలంగాణ – భువనగిరి కలెక్టరేట్
జిల్లాలోని అడ్డగూడూర్, ఆత్మకూర్ (ఎం) , మోత్కూర్ మండలాలలో ఈ దిగువ చూపిన గ్రామాల్లోని అమలులో ఉన్న నిబంధన మేరకు నూతన మీసేవ కేంద్రాలను ఏర్పాటు చేయుటకు జిల్లా మీసేవ కమిటీ నిర్ణయించినందున వాటిని నిర్వహించుటకు ఆసక్తి గల అభ్యర్దులు ధరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్, యాదాద్రి భువనగిరి గురువారం ఒక ప్రకటనలో కోరారు. 1) అడ్డగూడూర్ గ్రామం 2) ఆత్మకూర్ ఆత్మకూర్ గ్రామం, 3) మోత్కూర్ గ్రామంలో మీ సేవ కేంద్రాలను నిర్వహించుటకు గల అర్హతలు, మంచి కంప్యూటరు పరిజ్ఞానం. కనీస విద్యా అర్హతలు డిగ్రీ , ఆపై అర్హత, వయస్సు 21 సం. రాల నుండి 44 సం. రాల మధ్య వయస్సు గల వారు ఉండాలి. కేంద్రాలను నిర్వహించుటకు సరైన పెట్టుబడి స్థోమత కలిగి ఉండాలి.
పోలీస్ వారి క్లియరెన్స్ సర్టిఫికేట్ తో పాటుగా ఇట్టి మీ సేవ కేంద్రాలను నిర్వహించుటకు గాను అభ్యర్దులకు వ్రాత పరీక్ష/మౌఖిక పరీక్ష నిర్వహించి అభ్యర్దులను ఎంపిక చేయడం జరుగుతుందనీ అన్నారు. నిర్ధిష్టమైన ధరఖాస్తు ఫారాన్ని జిల్లా అధికారిక వెబ్ సైటు https://yadadri.telangana.gov.in/ పొందగలరు. పూర్తి వివరాలతో సంబంధిత ధృవ పత్రాలు జతపరచి తేది:07.11.2025 లోగా కలెక్టర్ గారి కార్యాలయం నందు “ ఇన్ వార్డ్ అండ్ అవుట్ వార్డ్” సెక్షన్ లో అందజేయగలరాని, నవంబర్ మూడవ తేదీ నా ప్రారంభమై ఏడవ తేదీ దరఖాస్తుల స్వీకరించబడుతుందని తెలిపారు. పూర్తి వివరాలకు 9121147135 సంప్రదించాలని కోరారు.


