Friday, October 31, 2025
E-PAPER
Homeకరీంనగర్రన్ ఫర్ యూనిటీనీ విజయవంతం చేయాలి:ఎస్పీ

రన్ ఫర్ యూనిటీనీ విజయవంతం చేయాలి:ఎస్పీ

- Advertisement -

నవతెలంగాణ – రాజన్న సిరిసిల్ల
రన్ ఫర్ యూనిటీ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో యువత , ప్రజలు , క్రీడకారులు, విద్యార్థులు పాల్గోని విజయవంతం చేయాలి జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే పేర్కొన్నారు. సిరిసిల్లలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ..
భారతదేశ ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతి సందర్భంగా నేడు ఉదయం ఏడు గంటలకు  జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా నుండి బతుకమ్మ ఘాట్ వరకు, అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ‘రన్ ఫర్ యూనిటీ’ కార్యక్రమంలో భాగంగా రన్ నిర్వహించనున్నట్లు జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. జిల్లా పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించే ఈ రన్ లో ప్రజలు , విద్యార్థులు , యువత , క్రీడాకారులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని ఐక్యత,జాతీయ సమైక్యత స్ఫూర్తిని చాటాలని ఆయన కోరారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -