Friday, October 31, 2025
E-PAPER
Homeకరీంనగర్మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం ఇవ్వాలి

మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం ఇవ్వాలి

- Advertisement -

  • ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్
  • డీఈఓ, జీసిడీఓ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈఎంఆర్ఎస్, గురుకులాల డీసీఓలు, ప్రిన్సిపాళ్లతో సమీక్ష సమావేశం
  • సమస్యలపై ఆరా

నవతెలంగాణ రాజన్న సిరిసిల్ల

జిల్లాలోని అన్ని రెసిడెన్షియల్ విద్యాలయాల్లో రాష్ట్ర ప్రభుత్వ నిబంధనల మేరకు మెనూ ప్రకారం నాణ్యమైన భోజనం విద్యార్థులకు తప్పకుండా ఇవ్వాలని ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈఎంఆర్ఎస్ గురుకులాల డీసీఓలు, జిసిడిఓ, డీఈఓతో జిల్లా సమీకృత కార్యాలయల సముదాయంలోని ఆడిటోరియంలో గురువారం ఇంచార్జి కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ముందుగా అన్ని విద్యాలయాల్లో విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయులు, సిబ్బంది తదితర వివరాలపై ఆ యొక్క ఆయా విద్య సంస్థల డిసిఓలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇంచార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ మాట్లాడారు. అన్ని విభాగాల విద్యాలయాల్లో డైనింగ్ హాల్లో మెనూకు సంబంధించిన పూర్తి వివరాలతో పెద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆహార పదార్థాలకు వినియోగించే అన్ని వివరాల రిజిస్టర్లు పక్కాగా నిర్వహించాలని సూచించారు. విద్యాలయాలకు కాంట్రాక్టర్ సరఫరా చేసే కోడిగుడ్లు, చికెన్, మటన్ ఇతర ఆహార పదార్థాల నాణ్యతను కచ్చితంగా పరిశీలించాలని స్పష్టం చేశారు. ఏమైనా లోపం ఉంటే వెంటనే తిప్పి పంపాలని ఆదేశించారు. విద్యార్థులకు ఆహార పదార్థాలు సిద్ధం చేసే సిబ్బంది కచ్చితంగా మాస్కులు ధరించాలని, కిచెన్, డైనింగ్ హాల్ ఇతర ఆవరణలో పరిశుభ్రంగా ఉంచాలని, శుద్ధమైన నీటిని విద్యార్థులకు అందించాలని సూచించారు. విద్యాలయాలు పరిశుభ్రంగా ఉండేలా చూసుకోవాలని ఆదేశించారు. విద్యార్థులకు అనారోగ్య సమస్యలు ఇంకా ఏమైనా ఇబ్బందులు అయితే వెంటనే జిల్లా ఉన్నతాధికారి దృష్టికి తీసుకురావాలని సూచించారు.
ప్రతి విద్యాలయంలో ఫుడ్ టెస్ట్ ఆఫీసర్ ఉండాలని వారు ఆహార పదార్థాలు రుచి చూసిన తర్వాతనే విద్యార్థులకు ఇవ్వాలని ఆదేశించారు. అన్ని విద్యాలయాల్లో అన్ అకాడమీ ఇతర పోటీపరీక్షల శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయా? అని ఆరా తీశారు. ఏ ఏ సమయంలో విద్యార్థులకు అందిస్తున్నారు డైలీ పరీక్షలు పెడుతున్నారా తదితర వివరాలు అడిగి తెలుసుకున్నారు.
అన్ని విద్యాలయాల్లో సివిల్ ఇతర పనులు ఏమైనా మంజూరు అయ్యాయా? వాటి ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఆయా విద్యాలయాల బాధ్యులు పూర్తి వివరాలతో ప్రతిపాదనలు అందించాలని దానిపై సమీక్ష చేసి ఆయా పనులను వెంటనే ప్రారంభించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. కార్యక్రమంలో డీఈఓ వినోద్ కుమార్, డిప్యూటీ డీఈఓ లక్ష్మీరాజం, వివిధ విద్యాలయాల ఎస్సీ, బీసీ, మైనార్టీ డీసీఓలు రవీందర్ రెడ్డి, సౌజన్య, భారతి, జీసీడీఓ పద్మజ, ఆయా విద్యా సంస్థల ప్రిన్సిపల్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -