- Advertisement -
పోస్టర్ ఆవిష్కరించిన హేమ సునీత
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ క్యాంపెయిన్ 4.0 ను నవంబర్ ఒకటి నుంచి 30 వరకు నిర్వహించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. ఈ మేరకు క్యాంపెయిన్ పోస్టర్ ను దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ హేమ సునీత ఆవిష్కరించారు. గురువారం సికింద్రాబాద్‌లోని రైల్ నిలయంలో జరిగిన కార్యక్రమంలో ఆమె పోస్టర్ ను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే ఛీఫ్ అకౌంట్స్ ఆఫీసర్, ఫైనాన్షియల్ అడ్వైజర్ అభిషేకానంద రావు, పీఎఫ్‌ఏ కార్యాలయ ఉన్నతాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -

 
                                    