- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: సీపీఐ(ఎం) పార్టీ సీనియర్ నేత సామినేని రామారావు రాజకీయ హత్యకు గురికావడంపై డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దారుణ ఘటనకు పాల్పడిన దోషులను చట్టపరంగా శిక్షిస్తామని, కలుషిత రాజకీయ హింసకు తావు లేదని ఆయన అన్నారు. అలాగే శాంతిభద్రతలపై ఖమ్మం పోలీస్ అధికారులను హెచ్చరించారు. క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్, సైబర్ టీం వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి దోషులను వెంటనే అరెస్ట్ చేయాలని ఆదేశించారు.
- Advertisement -

 
                                    