- Advertisement -
నవతెలంగాణ – హైదరాబాద్: చిత్తూరు మేయర్ దంపతుల హత్య కేసులో చిత్తూరు ఆరో అదనపు కోర్టు ఐదుగురికి ఉరిశిక్ష విధించింది. ఉరిశిక్ష పడిన వారిలో మేయర్ భర్త తరఫు బంధువు చింటూ ఉన్నాడు. అతడితో పాటు వెంకటచలపతి, జయప్రకాశ్‌రెడ్డి, వెంకటేశ్, మంజునాథ్‌కు ఉరిశిక్ష విధించింది. ఇదే కేసులో మరో 16 మందిపై నమోదైన కేసును న్యాయస్థానం కొట్టివేసింది. 2015 నవంబరు 17న అప్పటి చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, ఆమె భర్త మోహన్‌పై నగరపాలక సంస్థ కార్యాలయంలోనే కాల్పులు జరిపి హత్య చేశారు.
- Advertisement -

 
                                    