Saturday, November 1, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి

రోడ్డు ప్రమాదాల నివారణపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండాలి

- Advertisement -

నవతెలంగాణ – మునిపల్లి : రోడ్డు భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ వంటి అంశాలపై మండలంలోని మగ్దూంపల్లి ప్రాథమిక పాఠశాలలో శుక్రవారం నాడు విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో రహదారుల వెంట ప్రయాణ సమయంలో ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. 100,108 సేవలు, ఫుట్ బోర్డు ప్రయాణం, హెల్మెట్ ధరించడం, రోడ్డు దాటే సమయంలో తీసుకునే జాగ్రత్తలు, పెంపుడు జంతువులు వాటి నుండి జరిగే ప్రమాదాలు వంటి విషయాలపై విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు యాదయ్య, సయ్యద్ అహ్మద్ ఉపాధ్యాయులు యాదగిరి నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా రూట్ పెట్రోలింగ్ ఆఫీసర్లు మునావర్ అహ్మద్, రాములు రమేష్, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -