- Advertisement -
ముగిసిన గిరిజన కానోయింగ్ పోటీలు
నవతెలంగాణ-హైదరాబాద్
జాతీయ గిరిజన కానోయింగ్ స్ప్రింట్ చాంపియన్‌షిప్ పోటీల్లో తెలంగాణ ఓవరాల్ చాంపియన్‌గా నిలిచింది. పది రాష్ట్రాలు పోటీపడిన ఈ పోటీలు మూడు రోజుల పాటు హుస్సేన్‌సాగర్ వేదికగా ఉత్సాహంగా సాగాయి. అత్యధిక విభాగాల్లో పతకాలు సాధించిన తెలంగాణ అగ్రస్థానంలో నిలువగా.. అస్సాం, మహారాష్ట్ర ద్వితీయ, తృతీయ బహుమతులు గెల్చుకున్నాయి. శుక్రవారం బోట్స్‌క్లబ్‌లో జరిగిన ముగింపు వేడుకలకు క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి, గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరైన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు.
- Advertisement -



