మైనార్టీ ఉద్యోగుల సమస్యల్ని పరిష్కరించాలి
తెలంగాణ ఆర్టీసీ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్
ఆర్టీసీ ఎమ్‌డీ నాగిరెడ్డికి వినతిపత్రం అందజేత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలనీ, ఆర్టీసీలోని మైనార్టీ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ఆర్టీసీ మైనార్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు శుక్రవారం హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో తెలంగాణ ఆర్టీసీ వీసీ, ఎమ్‌డీ వై.నాగిరెడ్డికి ఆ అసోసియేషన్ ప్రతినిధులు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ గౌరవాధ్యక్షులు అర్షద్ సాహిఖ్, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ హఫీజ్‌ఖాన్, సలహాదారులు ఎమ్‌డీ రహీముద్దీన్ సాహెబ్, ఎమ్‌డీ. హిదాయత్ అలీ, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్‌డీ.అరిఫ్, మొహిసిన్, తదితరులు పాల్గొన్నారు.
ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి గ్రీవెన్సెస్ సదుపాయాన్ని కల్పించినట్టుగానే మైనార్టీ ఉద్యోగులకు కూడా కల్పించాలని ఆర్టీసీ ఎమ్‌డీ నాగిరెడ్డిని కోరారు. రంజాన్ నెలలో ఫాస్టింగ్ నేపథ్యంలో ఆర్టీసీలోని మైనార్టీ డ్రైవర్లు, కండక్టర్లకు ఉదయం పూట డ్యూటీ వేయాలని విన్నవించారు. సంవత్సరానికి ఒకసారి ఇచ్చే బోనస్‌ను రూ.10 వేలకు పెంచాలనీ, దసరా, క్రిస్‌మస్, రంజాన్ పండుగలను ఆప్షన్‌గా ఎంచుకునే అవకాశం కల్పించాలని కోరారు. ఆర్టీసీ సంస్థ తరఫున ఇచ్చే ఇఫ్తార్ విందులను తిరిగి ప్రారంభించాలని విన్నవించారు. 2021 పీఆర్సీని అమలు చేయాలని కోరారు. ఎలక్ట్రిక్ బస్సులను ప్రభుత్వమే కొనుగోలు చేసి ఆర్టీసీ సంస్థకిచ్చి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. తన పరిధిలోని సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని ఎమ్‌డీ హామీనిచ్చారు.
ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



