స్వాతంత్య్ర సమర యోధుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘ఏక్తా దివాస్’ (జాతీయ ఐక్యతా దినోత్సవం)ని జరుపుకుంటున్న సందర్భంగా హైదరాబాద్ సిటీ పోలీసులు శుక్రవారం ఉదయం ‘రన్ ఫర్ యూనిటీ’ని ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకకి ముఖ్య అతిథిగా హాజరైన చిరంజీవి మాట్లాడుతూ, ‘ఏక్తా దివస్’ కార్యక్రమం మన ఐరన్ మాన్ ఆఫ్ ఇండియా సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి రోజు జరుపుకోవడాన్ని, ఆ మహానుభావుడికి మనం గౌరవ సూచికంగా ఇస్తున్న ఘనమైన నివాళి. ఆయన దృడ సంకల్పం, విజన్, కార్యదీక్షత, ధైర్యం… ఇవన్నీ మనకు ఆదర్శనీయం.
560 ముక్కలైన దేశాన్ని ఒక్కటి చేసిన గొప్ప వ్యక్తి ఆయన. మన దేశం ‘వన్ నేషన్’గా ఉందంటే అది ఆయన మనకు అందించిన ఒక గొప్ప వరం. మేమందరం ఒకటే అని చెప్పడానికి ఇలా నివాళులర్పించడం అనేది ఒక గొప్ప కార్యక్రమం. ఆయన ఇచ్చిన ‘యూనిటీ ఇన్ డైవర్సిటీ’ (భిన్నత్వంలో ఏకత్వం) అనే సందేశాన్ని స్ఫూర్తిగా తీసుకుని, ఇలా ఒక ర్యాలీ చేయడం ఇప్పుడున్న యువతకు, భావితరాలకు గొప్ప ప్రేరణగా నిలుస్తుంది’ అని తెలిపారు.
మెగాస్టార్ ముఖ్య అతిథిగా ‘రన్ ఫర్ యూనిటీ’
- Advertisement -
- Advertisement -



