Sunday, November 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి 

పంట నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వాలి 

- Advertisement -

నవతెలంగాణ – ఆర్మూర్: మొంథా తుఫాన్ వల్ల నష్ట పోయిన రైతులకు నష్ట పరిహారం చెల్లించాలని  సబ్ కలెక్టర్ అభిగ్యాన్ మాల్వియా కు వినతి పత్రం సమర్పించినట్టు తెలంగాణ రైతు సంఘం  జిల్లా కార్యదర్శి పల్లపు వెంకటేష్ శనివారం తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అకాల వర్షాలతో రైతులు నట్టేట మునిగి ఆందోళన చెందుతుంటే రైతుల గోస ను పాలకులు పట్టుకొచ్చుకోవడం లేదని  విమర్శించారు.  డివిజన్ పరిధిలోని వేలాది ఎకరాలు పంట నష్టం వాటిలిందని ఆర్మూర్ డివిజన్ లో సుమారు 50 వేల ఎకరాలకు పైగా పంటలు నీటిపాలు అయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. చేతికి వచ్చిన పంట అకాల వర్షాలతో నాశనమైందని అన్న దాతలు ఆందోళన చెందుతున్నారని రైతులు విత్తనాలు నాటి  నుంచి మొదలుకొని ఎరువుల కోసం సాగునీటి కోసం చివరికి పండించిన పంట అమ్ముకునేందుకు నానా కష్టాలు పడుతున్నాడని ప్రతి సీజన్లో అకాల వర్షాలు రైతులను నట్టేట ముంచుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రకృతి వైపరీత్యాల రీత్ పంటలు నష్టపోతే పంటల బీమా పథకం కింద రైతులకు ఆదుకోవాల్సి ఉంటుందని కానీ ప్రభుత్వాలు పంటల బీమా పథకాన్ని అమలు చేయడం లేదని ఆరోపిచారు దాని ఫలితంగా ప్రకృతి వల్ల పంటల దెబ్బతింటే రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పారు. తక్షణమే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పంట నష్టపోయిన వివరాలను సేకరించి రైతులకు ఎకరానికి 30 వేలు చొప్పున నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకాన్ని అమలు చేసి ఆపదలో రైతులను ఆదుకోవాలని అన్నారు. ఐకేపీ కేంద్రాలలో తడిసిపోయిన ధాన్యాన్ని ప్రభుత్వమే మద్దతు ఇచ్చి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. తక్షణమే ప్రభుత్వాలు రైతులకు అండగా నిలవాలని ఆ విధంగా ప్రకటన చేయాలని కోరారు. లేనిపక్షంలో రైతులను సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు టీ భూమన్న, ఇడగొట్టి సాయిలు, కుల్దిప్ శర్మ, జన్నపల్లి నాడిపి రాజన్న, భామండ్ల రవి తదితరులు  పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -