- Advertisement -
నవతెలంగాణ – మద్నూర్ : మద్నూర్ మండల కేంద్రం నుండి కేరళ రాష్ట్రంలో గల శబరిమలై ఆలయానికి పాదయాత్రగా శనివారం నాడు స్వామి భక్తులు బయలుదేరారు. పాదయాత్రగా బయలుదేరిన భక్తులకు పలువురు గ్రామస్తులు వారికి ప్రత్యేకంగా స్వాగతం పలికారు. వేలాది కిలోమీటర్లు పాదయాత్ర చేపట్టే భక్తులు శబరిమలై ఆశీస్సులతో సుఖ సంతోషాలతో తిరిగి రావాలని గ్రామస్తులు ఆ భగవంతునితో కోరుకున్నారు.
- Advertisement -



