Sunday, November 2, 2025
E-PAPER
Homeఅంతర్జాతీయంటాంజానియా అధ్యక్షురాలిగా హసన్‌

టాంజానియా అధ్యక్షురాలిగా హసన్‌

- Advertisement -

నవతెలంగాణ – హైదరాబాద్: తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియా నూతన అధ్యక్షురాలిగా సామియా సులు హసన్‌ ఎన్నికయ్యారు. ఈ అధ్యక్ష ఎన్నికల్లో ప్రత్యర్థి లేకపోవడంతో ఈమె 98 శాతం ఓట్లతో విజేతగా నిలిచారు. బుధవారం ఓటింగ్‌ జరిగింది. శనివారం ఎన్నికల ఫలితాలను ఎలక్షన్‌ కమిషన్‌ ప్రకటించింది. ఈ ఎన్నికల్లో ఈమె ప్రతి నియోజకవర్గంలోనూ పైచేయి సాధించించిందని మొత్తంగా 97.77 శాతం ఓట్లను గెలుచుకున్నారని ఎన్నికల సంఘం ప్రకటించింది. శనివారం తరువాత ఈమె ప్రమాణ స్వీకారం కార్యక్రమం జరగనున్నట్లు అక్కడ మీడియా వర్గాలు పేర్కొన్నాయి.కాగా, ఈ ఎన్నికల్లో ప్రత్యర్థులను పోటీ చేయకుండా హసన్‌ నిరోధించారు. దీంతో ఈ ఎన్నికల్ని రద్దు చేయాలని నిరసనకారులు రోజుల తరబడి వీధుల్లో ఆందోళనలు చేశారు.

ఈ ఆందోళనల్ని పోలీసులు చెదరగొట్టే ప్రయత్నం చేశారు. ఎన్నికల రోజు కూడా నిరసనకారులు ప్రభుత్వ కార్యాలయాలకు నిప్పంటించారు. దీంతో ఆందోళనకారులపై పోలీసులు భాష్పవాయు ప్రయోగించారు. కాల్పులు జరిపారు. ఈ నిరసనల్లో 700 మంది మృతి చెందారని ప్రతిపక్షనేత చదేమా మీడియాకు తెలిపారు. అయితే గందరగోళ పరిస్థితుల నడుమ ఎన్నికల్ని నిష్పాక్షికంగా జరిపామని ఆ దేశ విదేశాంగ మంత్రి మొహమ్మద్‌ థాబిత్‌ కొంబో శుక్రవారం మీడియాకు తెలిపారు. ప్రతిపక్షాలు చెబుతున్నట్లు 700 మంది చనిపోలేదు. ఎక్కడా బలప్రయోగం జరగలేదు. ఇంతమంది చనిపోయినట్లు ప్రభత్వుం వద్ద గణాంకాలు కూడా లేవు అని ఆయన మీడియాకు స్పష్టం చేశారు. అయితే ఆందోళనల్లో మూడు నగరాల్లో పది మందికిపైగా మృతి చెందారని విశ్వసనీయ నివేదికలు సూచించాయని ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల కార్యాలయం తెలిపింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -