Sunday, November 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్రైతుల నడ్డి విరిచిన మొంథా తుఫాన్

రైతుల నడ్డి విరిచిన మొంథా తుఫాన్

- Advertisement -

– ఎకరాకు రూ.50వేల పరిహారం అందించాలి: ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
నవతెలంగాణ – మిర్యాలగూడ 
: మొంథా తుఫాన్ రైతుల నడ్డివిరిచిందని, తుఫాన్తో పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేల నష్ట పరిహారం అందించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదుకోవాలని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం డిమాండ్ చేశారు. శనివారం పట్టణంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వరంగల్, ఖమ్మం, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో తుఫాన్తో పంటలు నేలమట్టమయ్యాయని, వ్యవసాయానికి పెట్టిన పెట్టుబడులు సైతం వచ్చే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వం ఎకరాకు రూ.10వేల పరిహారం అందిస్తామనడం భావ్యం కాదని, వ్యవసాయాధికారులు క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదించాలన్నారు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విపత్తుగా పరిగణించి నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.50వేల పరిహారం అందించాలన్నారు. అదేవిధంగా పత్తిలో తేమశాతం కారణంతో ధర తగ్గిండచం సరికాదని, మద్దతు ధర చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ఇండ్లు కూలిపోయిన వారికి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని అన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బంటు వెంకటేశ్వర్లు, రైతు సంఘం జిల్లా ప్రధనా కార్యదర్శి జి. రాచమంద్రు, నాయకులు బిల్లా కనకయ్య, ఎండి. సయీద్, జిల్లా యాదగిరి, అంజనపల్లి రామలింగం, పోలేపల్లి ఉదయ్కుమార్, ధీరావత్ లింగానాయక్, వల్లంపట్ల వెంకన్న, మద్దిరాల రంగారెడ్డి, వెంకట్రెడ్డిలు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -