Sunday, November 2, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆదరణ అనాధ ఆశ్రమంలో పుట్టిన రోజు వేడుకలు

ఆదరణ అనాధ ఆశ్రమంలో పుట్టిన రోజు వేడుకలు

- Advertisement -

నవతెలంగాణ-పెద్దవూర
చలకుర్తి గ్రామానికి చెందిన పాతనబోయిన సంతోష్ కుమారుడు , మార్షల్ ఆర్ట్స్ నేషనల్ ప్లేయర్ , అంతర్జాతీయ బంగారు పతకాల విజేత , గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ హోల్డర్ పాతనబోయిన విహాస్ దుర్గ తన పుట్టినరోజు వేడుకలను అట్టహాసాలకు దూరంగా ఎల్ బి నగర్ ప్రాంతంలోని ఆదరణ అనాధ ఆశ్రమంలో 250 మంది అనాధ పిల్లల మధ్య కేక్ కట్ చేసి శనివారం మిఠాయిలు పంచి అందరికీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా సంతోష్ కుమార్ మాట్లాడుతూ పుట్టిన రోజు వేడుకలు అనగానే పార్టీ లు రెస్టారెంట్ లు అంటూ వేలకు వేలు ఖర్చుపెట్టి చేసుకోవడం కన్నా తల్లితండ్రులు లేని నిరాదరణకు గురైన చిన్నారుల మధ్య తన కుమారుని పుట్టిన రోజు జరుపుకోవడం సంతోషాన్ని ఇచ్చిందని , ప్రతి ఒక్కరు సెలబ్రేషన్స్ పేరుతో డబ్బును వృథాగా ఖర్చుపెట్టడం కన్నా ఇలాంటి వారికి ఒక్కపూటైన భోజనం పెట్టీ కడుపు నింపి వారి కళ్లలో ఆనందాన్ని నింపాలని అన్నారు. ప్రతిఒక్కరు ఈ విధంగా అలవాటుగా మార్చుకోవాలని కోరారు ..

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -