Monday, November 3, 2025
E-PAPER
Homeసమీక్షసదా! స్మరణీయులు

సదా! స్మరణీయులు

- Advertisement -

రచయితలకు, కవులకు కాలమే ప్రధాన వస్తువు. అందుకే దేశకాలమాన పరిస్థితులకు వారు స్పందించవలసిన అవసరం ఎంతైనా ఉంది. పుట 104 భారతదేశ చరిత్రలో ఆంగ్లేయుల పాలన నుండి విముక్తి పోరాటంలో పాల్గొనిన ఎందరో మహానుభావులు, జాతీయ వాదులు, సేవాదురంధరులను అప్పుడప్పుడు ఎవరోఒకరు వారలను పరిచయం చేస్తూవస్తున్నారు. గతంలో ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి వంటి పత్రికలలో మనమహానీయుల శీర్షికలో ధారావాహికంగా పరిచయం చేసారు. మళ్ళీ ఇప్పుడు సుబ్బాయమ్మ గారు 17 వ్యాసాలతో ‘సదాస్మరణీయులు’ పుస్తకంలో 17గురు, మహనీయులను, 2వ్యాసాలలో ఒకటి భారత స్వాతంత్య్ర ఉద్యమం, మరొకటి విముక్త తెలంగాణ కు సంబంధించినవి. శ్రీమతి సుబ్బాయమ్మ గారు గాంధీ, సుభాష్‌ చంద్రబోస్‌, బంకించంద్ర, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌, పటేల్‌, అల్లూరి, సర్వేపల్లి, పింగళి వెంకయ్య, గరిమెళ్ళ, పి.వి., జాషువా, నీలం సంజీవరెడ్డి, కాళోజీ, ప్రకాశం పంతులు, దాశరథిలను పరిచయం చేశారు. ఆయా వ్యక్తులను సమగ్రంగా వారి రేఖాచిత్రాలనందించారు.

‘విముక్త తెలంగాణ’ వ్యాసంలోని ఈ వాక్యాలను గమనించండి. ”మన సమాజమొక పూరావిప్పారిన పుష్పం” గా వికసించాలని కోరారు. తెలంగాణ మాగాణము ఆనాడు తమ ప్రాణాలను తణప్రాయంగా భావించిన ఎంతో మంది త్యాగాల ఫలితం అని గ్రహించాలి. వారి త్యాగాలను సదా గుర్తుంచుకోవాలి. ఆ పోరాటం ఫలితంగా ‘తెలంగాణ ప్రాంతం ఒక కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది” – పుట 81. ప్రస్తుతమున్న తెలంగాణను మనము కాపాడుకోవాల్సిన అవసరం ఉందని చెప్పకనే చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ నేపథ్యంలో సుబ్బాయమ్మ గారికి తెలంగాణ తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణ రావు గారు స్ఫురణకు రానట్టుంది. చరిత్ర పుటల్లో నిలిచిన మహానుభావులను కొత్త తరానికి వీరందరినీ పరిచయం చేసి మంచిపని చేసారని చెప్పవచ్చును. చరిత్రలోని చిరంజీవులను స్మరించుకోవడం అనే సంప్రదాయానికి మార్గం వేసిన సుబ్బాయమ్మ గారికి జేజేలు.

  • డా|| టి.శ్రీరంగస్వామి, 9949857955
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -