- పత్తి, వరి రైతులకు సాయం అందిస్తాం
- భూపాలపల్లి ఎమ్మెల్యే
నవతెలంగాణ-టేకుమట్ల
ఇటీవల కురిసిన భారీ మొంథా తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న పత్తి, వరి పంట పొలాలను భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు పరిశీలించారు. మండలంలోని రాఘవరెడ్డి పేట, అంకుషాపూర్ కుందనపల్లి ,గుమ్మడవెల్లి చలివాగు చుట్టుపక్కల వరి పొలాలు మొంథా తుఫాను వరద ఉధృతికి నీటమునిగి పోవడంతో విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే ఆదివారం అధికారులతో గుమ్మడవెల్లి గ్రామాలలో పర్యటించి రైతులను పంటనష్ట వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ తుపాను ప్రభావంతో నష్టపోయిన రైతులు ఎవరు ఆధర్యపడోద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.తడిచిన ప్రతి వరి గింజను తేమ ఉన్న కొనుగోలు చేసి బోనస్ తో కలిపి చెల్లిస్తామని తక్షణ సహాయం కింద నష్టపోయిన పత్తి, వరి రైతులకు ప్రతి ఎకరానికి పదివేల రూపాయల నష్టపరిహారానికి అందజేస్తామని అన్నారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు వరద ప్రభావిత ప్రాంతాలలో తిరిగి నష్టాన్ని అంచనా వేసి, నష్టపోయిన ప్రతి రైతు వివరాలను మూడు రోజులలో పైఅధికారులకు అందజేయాలని అధికారులకు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు కోటగిరి సతీష్ గౌడ్,ప్రధాన కార్యదర్శి దాసారపు సదానందం,మాజీ జెడ్పిటిసి తిరుపతిరెడ్డి, మాజీ ఎంపిటిసి సంగి రవి,జిల్లా నాయకులు తిప్పిరెడ్డి కృష్ణారెడ్డి,కాంగ్రెస్ నాయకులు తోట గట్టయ్య, అడగానీ రామారావు, నాంపేల్లి వీరేశం, మండల వ్యవసాయ శాఖ అధికారి కళ్యాణి పాల్గొన్నారు.



