Monday, November 3, 2025
E-PAPER
Homeతాజా వార్తలుగెలుపు తలుపు దొరికే వరకు..

గెలుపు తలుపు దొరికే వరకు..

- Advertisement -

శివ రాజ్‌ కుమార్‌, ఉపేంద్ర, రాజ్‌ బి శెట్టి వంటి అగ్ర నటులతో అర్జున్‌ జన్య తెరకెక్కిస్తున్న చిత్రం ’45 ది మూవీ’. సూరజ్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌ మీద ఉమా రమేష్‌ రెడ్డి, ఎం రమేష్‌ రెడ్డి నిర్మిస్తున్నారు. ఇప్పటి వరకు ఈ మూవీ నుంచి వచ్చిన పోస్టర్‌, గ్లింప్స్‌ అన్నీ కూడా ఆడియెన్స్‌లో భారీ హైప్‌ను పెంచేశాయి. ఈ చిత్రాన్ని డిసెంబర్‌ 25న విడుదల చేయబోతున్నట్లు మేకర్లు ప్రకటించారు.ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం ఓ క్రేజీ సాంగ్‌ను చిత్రయూనిట్‌ రిలీజ్‌ చేసింది. ‘గెలుపు తలుపు దొరికే వరకు దిగులుపడుకురా’ అంటూ సాగే ఈ సాంగ్‌కు రోల్‌ రైడా తెలుగులో సాహిత్యాన్ని అందించారు. రోల్‌ రైడా, వినాయక్‌ కలిసి ఆలపించిన ఈ పాటకు జానీ మాస్టర్‌ కంపోజ్‌ చేశారు.

ఈ వీడియో సాంగ్‌లోని వాతావరణం, చుట్టూ కనిపిస్తున్న ఆఫ్రికన్స్‌ వారితో జానీ మాస్టర్‌ వేయించిన స్టెప్పులు అదిరిపోయాయి. ఇక ఈ పాటలో శివ రాజ్‌ కుమార్‌, ఉపేంద్ర, రాజ్‌ బి శెట్టి తమదైన స్టయిల్‌లో కనిపిస్తున్నారు. అర్జున్‌ జన్య ఇచ్చిన బాణీ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. ప్రస్తుతం ఈ పాట యూత్‌ను బాగా అలరిస్తోంది. ఈ చిత్రానికి నిర్మాత: ఉమా రమేష్‌ రెడ్డి, ఎం.రమేష్‌ రెడ్డి, కథ, సంగీతం, దర్శకత్వం: అర్జున్‌ జన్య, సినిమాటోగ్రాఫర్‌ : సత్య హెగ్డే, ఎడిటర్‌ : కె.ఎం.ప్రకాష్‌, గాయకులు : రోల్‌ రిడా, వినాయక్‌, సాహిత్యం: రోల్‌ రైడా, స్టంట్స్‌ : డాక్టర్‌ కె రవి వర్మ, జాలీ బాస్టియన్‌, డానీ చేతన్‌ డిసౌజా, కొరియోగ్రాఫర్‌ : జానీ బాషా, డైలాగ్స్‌ : అనిల్‌ కుమార్‌.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -