ప్రియదర్శి, ఆనంది జంటగా నటిస్తున్న రొమాంటిక్ కామెడీ మూవీ ‘ప్రేమంటే’. సుమ కనకాల ముఖ్య పాత్ర చేస్తున్నారు. నవనీత్ శ్రీరామ్ డైరెక్టర్‌గా పరిచయం అవుతున్న ఈ చిత్రాన్ని పుస్కూర్ రామ్ మోహన్ రావు, జాన్వీ నారంగ్ నిర్మాణంలో శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. రానా దగ్గుబాటి స్పిరిట్ మీడియా సమర్పిస్తోంది. దివంగత నారాయణ్ దాస్ నారంగ్‌కి ట్రిబ్యుట్‌గా నిలిచే ఈ చిత్రానికి ఆదిత్య మెరుగు సహ నిర్మాత. ఈ చిత్ర టీజర్‌ను ఆదివారం లాంచ్ చేశారు. హీరో ప్రియదర్శి మాట్లాడుతూ, ‘టీజర్ మీ అందరికీ నచ్చడం చాలా ఆనందంగా ఉంది.
ఈనెల 21 గుర్తుపెట్టుకోండి. డిస్ట్రిక్ యాప్‌లో ఒక టికెట్ కొని, ఒక టికెట్ ఉచితంగా పొందండి’ అని అన్నారు. ‘థ్రిల్ కావాలనే అమ్మాయి, లైఫ్‌లో సెటిల్ అవ్వాలి అనుకునే అబ్బాయి కలిస్తే ఎంత ఫన్ ఉంటుందో ఈ సినిమాలో చూస్తారు’ అని డైరెక్టర్ నవనీత్ శ్రీరామ్ చెప్పారు. నిర్మాత జాన్వి నారంగ్ మాట్లాడుతూ, ‘ఒక బ్యూటీఫుల్ సినిమా తీసుకొస్తున్నాం. తప్పకుండా చూడండి. మీ అందరికీ నచ్చుతుంది’ అని అన్నారు. ‘ఇందులో నేను పోషించిన పాత్ర మిమ్మల్ని బాగా అలరిస్తుంది’ అని సుమ కనకాల చెప్పారు.
‘ప్రేమంటే’ రిలీజ్‌కి రెడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



