చిరంజీవి నటిస్తున్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘మన శంకర వర ప్రసాద్ గారు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో వెంకటేష్ ఒక కీలక పాత్రలో కనిపించనున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని అర్చన సమర్పిస్తున్నారు. ఆదివారం నుండి చిరంజీవి, ఫైటర్స్ బృందం పాల్గొనే స్టైలిష్ క్లైమాక్స్ యాక్షన్ సీక్వెన్స్‌ను హైదరాబాద్‌లో చిత్రీకరించడం ప్రారంభించారు. ఇది ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా విజువల్‌గా అద్భుతంగా తెరకెక్కిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో ప్రతి సన్నివేశం గ్రాండ్‌గా రూపొందుతోంది. చిరంజీవి చరిష్మా, గ్రేస్, అనిల్ రావిపూడి టచ్ కలిసిన ఈ క్లైమాక్స్ సీక్వెన్స్ ప్రేక్షకులకు మరిచిపోలేని అనుభూతిని అందించనుంది.
ప్రస్తుతం చిత్ర నిర్మాణ కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. రాబోయే సంక్రాంతికి ఈ సినిమా బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా ప్రేక్షకులు ముందుకు రానుంది అని చిత్ర యూనిట్ తెలిపింది. చిరంజీవి, నయనతార, వీటీవీ గణేష్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి రచన, దర్శకత్వం- అనిల్ రావిపూడి, నిర్మాతలు – సాహు గారపాటి, సుస్మిత కొణిదెల, సమర్పణ – అర్చన, సంగీతం – భీమ్స్ సిసిరోలియో, డీవోపీ – సమీర్ రెడ్డి, ప్రొడక్షన్ డిజైనర్ – ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటర్ – తమ్మిరాజు, రైటర్స్ – ఎస్ కృష్ణ, జి ఆది నారాయణ, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కృష్ణ, వీఎఫ్‌ఎక్స్ సూపర్‌వైజర్ – నరేంద్ర లోగిసా, లైన్ ప్రొడ్యూసర్ – నవీన్ గారపాటి, ఎడిషినల్ డైలాగ్స్ – అజ్జు మహంకాళి, తిరుమల నాగ్.
క్లైమాక్స్ ఫైట్ చిత్రీకరణలో..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



