నవతెలంగాణ – ఇబ్రహీంపట్నం : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ వద్ద ఏపీఎస్ఆర్టీసీ బస్సు(పొదిలి డిపో కు చెందిన ఏపీ40జెడ్0771)ను వెనుకనుండి ఢీకొట్టిన ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు(దోస్త్ టూర్స్ అండ్ ట్రావెల్స్ బస్సు. ఏఆర్06సి2414) డీ కొట్టడంతో బస్సులు పాక్షికంగా దెబ్బతిన్నాయి. ఆంద్రప్రదేశ్ నుండి హైదరాబాద్ కు ప్రయాణికులతో వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదు. ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. ఆదివారం రోజు స్పీడ్ బ్రేకర్లను ఏర్పాటు చేసిన అధికారులు, అది చూడకుండా వేగంగా రావడంతో బస్సు ప్రమాదం చోటుచేసుకుంది. గతవారం రోజుల క్రితం స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేయగా రెండు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. దీంతో వెంటనే ఆ స్పీడ్ బ్రేకర్ ను తొలగించారు. మళ్ళీ వేయడంతో ప్రమాదం.
ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ప్రయివేట్ ట్రావెల్స్ బస్సు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



