Tuesday, August 12, 2025
E-PAPER
spot_img
Homeఖమ్మంఉద్యాన క్షేత్రాల్లో పులి సంచారం.?

ఉద్యాన క్షేత్రాల్లో పులి సంచారం.?

- Advertisement -

ఓ రైతు చూసినట్లుగా సమాచారం..
పాదముద్రలను అన్వేషించిన అటవీ సిబ్బంది…
హైనాగా అనుమానం?
నవతెలంగాణ – అశ్వారావుపేట
: మండలంలోని గంగారం, పేటమాలపల్లి, పేపర్ బోర్డ్ వెనుక అటవీ ప్రాంతాల్లో పులి సంచారం ఉన్నట్లుగా పుకార్లు పుట్టాయి. బుధవారం పేట మాలపల్లి సమీపంలోని కొబ్బరి లో అంతర పంట గా కోకో సాగుచేస్తున్న జూపల్లి వెంకటరామారావు (బుజ్జి) ఉద్యాన క్షేత్రంలో ఆయన కంట పడినట్లు మీడియాకు తెలిపాడు. దీంతో ఎఫ్ఆర్ఓ మురళి, ఎఫ్.బీ.ఓ నరేష్ తో కలిసి పులి పాదముద్రలను వెతికారు. వర్షం పడటంతో పాదముద్రలు లభ్యం కావని తెలుస్తుంది. చిరుత పులి కాదని నక్క జాతికి చెందిన హైనా అయి ఉంటుందని అటవీ అధికారులు తెలిపారు. అయినప్పటికీ అదిగో పులి అంటే ఇదిగో తోక అనే సామెత వైరల్ అవుతుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img