Tuesday, November 4, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్మాదకద్రవ్యాలు వద్దు - జీవితం ముద్దు

మాదకద్రవ్యాలు వద్దు – జీవితం ముద్దు

- Advertisement -

నవతెలంగాణ – తలకొండపల్లి
మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన కోసం ప్రారంభించిన నషా ముక్త్‌ భారత్‌ అభియాన్‌(ఎన్‌ఎంబీఏ) కార్యక్రమాలను వేగవంతం చేయాలని ఇన్చార్జి ఎస్ఐ శేఖర్, ఐసిడిఎస్ సూపర్వైజర్ బాలమణి  పిలుపునిచ్చారు. సోమవారం మండల పరిధిలోని చుక్కాపూర్  ప్రభుత్వం ఉన్నంత పాఠశాలలో విద్యార్థులతో  మత్తు పదార్థాలు, మాదక ద్రవ్యాల నిర్మూలన ర్యాలీ తీయడం జరిగింది,నషా ముక్త్ భారత్ విద్యార్థులకు నిర్వహించడం జరిగింది.  ఈ సందర్భంగా ఇన్చార్జి ఎస్ఐ శేఖర్ మాట్లాడుతూ  మాదకద్రవ్యాలకు అలవాటు పడిన వారి జీవితం నాశనం  జరుగుతుంది. ప్రస్తుతం జరుగుతున్న డ్రగ్స్ కేసుల గురించి వివరించడం జరిగింది. డ్రగ్స్ అంటే ఏంటి దానివల్ల నష్టాలు ఏంటి వాటి వాడకం వల్ల వచ్చే సమస్యల గురించి  వివరించడం విద్యార్థులకు తెలపడం జరిగింది. ఈ సందర్భంగా ఐసిడిఎస్ సూపర్వైజర్  బాలమణి మాట్లాడుతూ డ్రగ్స్ కు అలవాటు పడకూడదు ఈ వయసులోనే మీకు దాని గురించి తెలిసినచో ఇలాంటిదాంట్లకు అలవాటు పడవద్దని విద్యార్థులకు తెలిపారు.ఈకార్యక్రమంలోఇన్చార్జి ఎస్ఐ శేఖర్,ఐసిడిఎస్ సూపర్వైజర్ బాలమణి, ప్రధానోపాధ్యాయులు శ్రీను, ఉపాధ్యాయులు, అంగన్వా టీచర్స్ ప్రసన్న, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -