- Advertisement -
నవతెలంగాణ – సూర్యాపేట కలెక్టరేట్
సూర్యాపేట జిల్లా సహకార అధికారి ఎస్. పద్మ సెలవుపై వెళ్ళడంతో ఆమె స్థానంలో పి.ప్రవీణ్ కుమార్ జిల్లా సహకార అధికారిగా అదనపు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సోమవారం స్థానిక జిల్లా సహకార కార్యాలయంలో సహకార శాఖ ఉద్యోగులు శాలువ, పూలమాలలు వేసి ఆయన కు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంస్థల అభివృద్ధికి,రైతుకు సంబంధించిన సహకార సంఘాల బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. ఉద్యోగులు సమిష్టిగా పనిచేసి జిల్లా సహకార వ్యవస్థను మరింత బలపరచాలని పిలుపునిచ్చారు.
- Advertisement -

                                    

