– ఉన్నత విద్యాసంస్థల సమాఖ్య
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రయివేటు కాలేజీల నిరవధిక బంద్‌లో భాగంగా సోమవారం మొదటి రోజు బంద్‌కు సహకరించిన ప్రజలు, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులకు ఉన్నత విద్యా సంస్థల సమాఖ్య కృతజ్ఞతలు తెలిపింది. సోమవారం సాయంత్రం హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో సమాఖ్య చైర్మెన్ రమేశ్ బాబు తదితరులు మాట్లాడారు. పెండింగ్ స్కాలర్ షిప్స్ రూ.10 వేల కోట్లలో సగం రూ.5 వేల కోట్లు వెంటనే చెల్లించేంత వరకు నిరవధిక బంద్ కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. నవంబర్ 8న కనీసం 30 వేల మంది ఉన్నత విద్యాసంస్థల ఉద్యోగులతో భారీ సమావేశం నిర్వహిస్తామనీ, 11న 10 లక్షల మంది విద్యార్థులతో సచివాలయానికి లాంగ్ మార్చ్ చేపడతామని వారు ప్రకటించారు.
బంద్‌కు సహకరించిన వారందరికి కృతజ్ఞతలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES

                                    

