నవతెలంగాణ – వేములవాడ
అనంత విభూషిత శ్రీ దక్షిణామ్నాయ శ్రీ శారదా శృంగేరి పీఠాధిపతులు జగద్గురువులు శ్రీ శ్రీ శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారికి మంగళవారం రాష్ట్ర మంగళవారంప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఘనంగా వీడ్కోలు పలికారు. ధర్మవిజయ యాత్రలో భాగంగా స్వామి వారు గత 18 రోజులుగా తెలంగాణ రాష్ట్రంలోని హైదరాబాదు, కొంపల్లి, బాసర, వేములవాడతో పాటు భాగ్యనగరంలోని పలు క్షేత్రాలను సందర్శించి భక్తులను ఆశీర్వదించారు. ప్రత్యేక విమానంలో శృంగేరి పీఠానికి బయల్దేరిన సందర్భంగా నల్లకుంట శంకర మఠం ధర్మాధికారులు, తెలంగాణ శృంగేరి పీఠం బాధ్యులు రాధాకృష్ణ శర్మతో కలిసి ఆది శ్రీనివాస్ స్వామి వారికి పూర్ణకుంభ స్వాగతం అందించి, భక్తులతో కలసి ఘనంగా వీడ్కోలు తెలిపారు. శ్రీ శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి సంపూర్ణ అనుగ్రహాశీస్సులతో ధర్మ ప్రచార యాత్ర విజయవంతంగా పూర్తయిన సందర్భంగా భక్తులు హర్షం వ్యక్తం చేశారు.
శృంగేరి జగద్గురువులకు ఘన వీడ్కోలు పలికిన ప్రభుత్వ విప్ ఆది..
- Advertisement -
- Advertisement -



