Wednesday, November 5, 2025
E-PAPER
Homeజిల్లాలుజీవనశైలిలో మార్పులతోనే క్యాన్సర్లకు దూరం

జీవనశైలిలో మార్పులతోనే క్యాన్సర్లకు దూరం

- Advertisement -
  • ఎమ్మెల్యే సతీమణి వేముల పుష్ప, ఐఎంఏ అధ్యక్షుడు డాక్టర్ రాపోలు రఘునందన్
    నవతెలంగాణ-నకిరేకల్‌: ప్రతి మనిషి తన జీవనశైలిలో మార్పులు చేసుకోవడం వల్ల వివిధ రకాల క్యాన్సర్లతో పాటు బ్రెస్ట్ క్యాన్సర్‌కు దూరంగా ఉండవచ్చని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం సతీమణి వేముల పుష్ప, ఐఎంఏ నకిరేకల్ శాఖ అధ్యక్షుడు డాక్టర్ రాపోలు రఘునందన్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక శ్రీ శ్రీనివాస నర్సింగ్ హోహ్‌లో డాక్టర్ రాపోలు ఫౌండేషన్, నల్లగొండ ఓబిజీ సొసైటీ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో మహిళలకు, పురుషులకు హెచ్‌బీ, ఆర్‌బీఎస్, బీఎండీ, టీ-3, టి-4, టిఎస్ హెచ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవన విధానంలో కొత్త పోకడలు కాకుండా పూర్వ పద్ధతులు పాటించాలన్నారు. వంట పాత్రలు ప్లాస్టిక్ కాకుండా ఇత్తడి, స్టీలు వంటివి వాడటం వల్ల క్యాన్సర్ కు దూరంగా ఉండవచ్చని పేర్కొన్నారు, శారీరక శ్రమ, నిద్ర, ఒత్తిడి, ఆల్కహాల్, ధూమపానం, శీతల పానీయాలను నియంత్రించుకోవాలన్నారు. డాక్టర్ రాపోలు ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ రాపోలు మంజుల రఘునందన్ మాట్లాడుతూ బ్రెస్ట్ క్యాన్సర్‌ను తొలిదశలో గుర్తించి నయం చేసే ముందస్తు పరీక్షలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. హెచ్‌పీవీ వ్యాక్సిన్‌ను 10 నుండి 45 సంవత్సరాల వయస్సు గల వారు వేయించుకోవచ్చన్నారు. ఈ శిబిరంలో 200 మంది పరీక్షలు చేయించుకున్నారు. ఈ కార్యక్రమంలో సిఐఓఎన్ క్యాన్సర్ హాస్పిటల్ ఆంకో సర్జన్ డాక్టర్ వినయ్, మునిసిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్ గౌడ్, వైస్ చైర్మన్ మురారిశెట్టి ఉమారాణి కృష్ణమూర్తి, శ్రీనివాస నర్సింగ్ హోమ్ సిబ్బంది పాల్గొన్నారు.
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -