Wednesday, November 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ప్రతిభను వెలికి తీయడానికే పోటీలు: డీఈఓ రాజు 

ప్రతిభను వెలికి తీయడానికే పోటీలు: డీఈఓ రాజు 

- Advertisement -

నవతెలంగాణ-రామారెడ్డి 
విద్యార్థుల్లో ప్రతిభను వెలికితీయటానికే , పోటీతత్వాన్ని పెంచడానికి పోటీ పరీక్షలు దోహదపడతాయని జిల్లా విద్యాశాఖ అధికారి రాజు అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని మానవ వనరుల కేంద్రంలో అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు టీ షర్టులను అందజేశారు. జిహెచ్ఎం నా ఆధ్వర్యంలో మండల స్థాయి ప్రతిభ పోటీలను నిర్వహించారు. వీధిలో కే సృజన (జడ్పీహెచ్ఎస్ బాలికల రామారెడ్డి) ఉపన్యాసంలో బి మధులిక (జడ్.పి.హెచ్.ఎస్ గిద్ద) వ్యాసరచన లో బి సందీప్ (జెడ్పిహెచ్ఎస్ బాలుర రామారెడ్డి) లకు జ్ఞాపికలను అందజేశారు. జిల్లాస్థాయిలో పోటీలో పాల్గొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మోతే సిద్ధిరాంరెడ్డి, ఎంఈఓ ఆనంద్ రావు, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఆనంద్, గోపాల్ రెడ్డి, ప్రధానోపాధ్యాయులు వేణు మాధవ్, శ్రీనివాస్, కన్నయ్య, ఉపాధ్యాయులు దేవి ప్రసాద్, సీఆర్పీలు మహమ్మద్, యుగేందర్, సురేఖ , అజీమ్, మౌనిక, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -